కరీంనగర్‌ పోలీస్‌ కమిషనరేట్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు

మహిళా పోలీసుల కోసం పరేడ్‌ మైదానంలో ప్రత్యేక ఏర్పాట్లు ముఖ్య అతిథులుగా జిల్లా ప్రధాన న్యాయమూర్తి శివకుమార్‌, కమిషనర్‌ ప్రఫుల్‌ దేశాయ్‌, డీఎఫ్‌ఓ సత్యనారాయణ కరీంనగర్‌, అక్టోబర్‌ 15 (చైతన్యగళం): తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే బతుకమ్మ పండుగను పురస్కరించుకుని కరీంనగర్‌ పోలీస్‌ కమిషనరేట్‌ కేంద్రంలోని పరేడ్‌ మైదానంలో మహిళా పోలీసు అధికారులు, సిబ్బంది కోసం ప్రత్యేకంగా బతుకమ్మ సంబరాలు నిర్వహించారు. పోలీస్‌ కమిషనర్‌ గౌష్‌ ఆలం చొరవతో జరిగిన ఈ వేడుకల్లో మహిళా పోలీసులు ఉత్సాహంగా పాల్గొని బతుకమ్మ పాటలు, నృత్యాలతో...