- చెత్త సేకరణ ప్రక్రియను స్వయంగా పరిశీలించిన మున్సిపల్ కమిషనర్
నందికొట్కూరు, అక్టోబర్ 3(చైతన్యగళం): పట్టణ పారిశుధ్య నిర్వహణలో భాగంగా మున్సిపల్ కమిషనర్ జి. వెంకటరామిరెడ్డి శనివారం ఆత్మకూరు రోడ్డులో పారిశుధ్య పనులను పరిశీలించారు. పట్టణంలో చెత్త సేకరణ కోసం ఏర్పాటు చేసిన చెత్త తరలింపు వాహనం ద్వారా జరుగుతున్న చెత్త సేకరణను స్వయంగా పర్యవేక్షించారు.
డంపర్ బిన్‌లోని చెత్తను పారిశుధ్య కార్మికులు తొలగించి చెత్త తరలింపు వాహనంలోకి నింపుతున్న తీరును కమిషనర్ పరిశీలించారు. చెత్త సేకరణ, తరలింపు ప్రక్రియలో ఎలాంటి నిర్లక్ష్యం లేకుండా చూడాలని సిబ్బందికి సూచించారు.

ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ పట్టణ పరిశుభ్రతే ప్రధాన లక్ష్యమన్నారు. ప్రతిరోజూ ఉదయం చెత్త సేకరణ పూర్తయ్యేలా చర్యలు తీసుకోవాలని సిబ్బందిని ఆదేశించారు. రోడ్ల వెంబడి చెత్త వేయకుండా ప్రజలు మున్సిపల్ సిబ్బందికి సహకరించాలని కోరారు.
