- పనులను త్వరగా పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలి
నందికొట్కూరు, అక్టోబర్ 3(చైతన్యగళం): పట్టణంలోని ఆత్మకూరు రోడ్డులోని కేజీ రోడ్డు, షికారి పేటలో నూతనంగా నిర్మిస్తున్న సీసీ రోడ్ల పనులను మున్సిపల్ కమిషనర్ జి. వెంకటరామిరెడ్డి, ఏఈ దినేష్ కుమార్ శనివారం ఉదయం పరిశీలించారు.
ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ సీసీ రోడ్ల నిర్మాణంలో నాణ్యతా ప్రమాణాలను తప్పనిసరిగా పాటించాలని అధికారులకు, కాంట్రాక్టర్లకు సూచించారు. రోడ్ల నిర్మాణం పూర్తయిన అనంతరం వాటర్ క్యూరింగ్ సక్రమంగా చేపట్టాలని ఆదేశించారు. పనులను వేగంగా పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని సూచించారు.
రోడ్ల నిర్మాణ పనుల వల్ల ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని కమిషనర్ అధికారులను ఆదేశించారు.
