Friday, November 20, 2026
Homeతెలంగాణపట్టభద్రుల ఎమ్మెల్సీ ఓటరు నమోదులో ఉద్యోగులు చురుగ్గా పాల్గొనాలి

పట్టభద్రుల ఎమ్మెల్సీ ఓటరు నమోదులో ఉద్యోగులు చురుగ్గా పాల్గొనాలి

📰 Generate e-Paper Clip

సెక్రటేరియట్‌ ఉద్యోగులకు అసోసియేషన్‌ అధ్యక్షుడు గిరి శ్రీనివాస్‌రెడ్డి విజ్ఞప్తి

హైదరాబాద్‌, అక్టోబర్‌ 24 (చైతన్యగళం): పట్టభద్రుల ఎమ్మెల్సీ ఓటరు నమోదు కార్యక్రమంలో తెలంగాణ సచివాలయ ఉద్యోగులందరూ చురుగ్గా పాల్గొనాలని డాక్టర్‌ బి.ఆర్‌. అంబేద్కర్‌ తెలంగాణ సెక్రటేరియట్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడు గిరి శ్రీనివాస్‌రెడ్డి విజ్ఞప్తి చేశారు. మహబూబ్‌నగర్‌–రంగారెడ్డి–హైదరాబాద్‌, నల్లగొండ–వరంగల్‌–ఖమ్మం ఉమ్మడి జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ ఓటరు నమోదుకు నవంబర్‌ 6వ తేదీతో గడువు ముగియనున్న నేపథ్యంలో అర్హులైన ఉద్యోగులంతా వెంటనే దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.

ఆరేళ్లకు ఒకసారి చేపట్టే పట్టభద్రుల ఎమ్మెల్సీ ఓటరు నమోదు ప్రక్రియను ఉద్యోగులు సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు. గతంలో ఓటు హక్కు కలిగి ఉన్నవారు సైతం తిరిగి దరఖాస్తు చేసుకోవాల్సిందేనని స్పష్టం చేశారు. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఓటరు జాబితాలో గతంలో నమోదైన వారికి ఈసారి ఆటోమేటిక్‌గా పునరుద్ధరణ ఉండదని, అర్హులైన ప్రతి ఒక్కరూ కొత్తగా దరఖాస్తు చేసుకోవాలని తెలిపారు.

ఉద్యోగులందరూ ఓటర్లుగా నమోదై ప్రజాస్వామ్య ప్రక్రియలో భాగస్వాములు కావాలని, తద్వారా ఉద్యోగుల సమస్యలు, హక్కుల సాధనకు చట్టసభల్లో తమ వాణిని వినిపించే అవకాశం ఉంటుందని శ్రీనివాస్‌రెడ్డి పేర్కొన్నారు.

పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటు హక్కు పొందేందుకు అర్హులైన వారు తెలంగాణ ప్రధాన ఎన్నికల అధికారి అధికారిక వెబ్‌సైట్‌ ceotelangana.nic.in⁠ ద్వారా ఆన్‌లైన్‌లో ఫారం-18 సమర్పించి నమోదు చేసుకోవచ్చని వివరించారు. దరఖాస్తు సమయంలో పాస్‌పోర్టు సైజు ఫొటో, డిగ్రీ లేదా పీజీ పట్టా ధ్రువీకరణ పత్రాన్ని అప్‌లోడ్‌ చేయాలని సూచించారు. అలాగే మొబైల్‌ నంబరు, ఈ-మెయిల్‌ చిరునామా, ఆధార్‌ వివరాలు, అవసరమైన సందర్భంలో ఓటరు గుర్తింపు కార్డు వివరాలను నమోదు చేయాలని తెలిపారు. గడువులోగా ప్రక్రియను పూర్తి చేసుకొని పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటు హక్కు పొందాలని సచివాలయ ఉద్యోగులకు ఆయన విజ్ఞప్తి చేశారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install CG News App

Add to home screen for faster loading and latest updates.

error: Content is protected !!