కోడలిగా అడుగుపెట్టి… కూతురిగా నిలిచిన నర్మదా…
కుటుంబ బంధాలకు నర్మదా ఓ ఆదర్శం బొడ్ల వెంకటయ్య 80వ జన్మదిన వేడుకల్లో కుటుంబ విలువలకు ప్రాధాన్యం మహబూబాబాద్, అక్టోబరు 2 (చైతన్యగళం): జిల్లా కేంద్రంలోని ఎస్‌ఎస్‌వీఎల్ ఫంక్షన్‌హాల్‌లో బొడ్ల వెంకటయ్య 80వ జన్మదినాన్ని పురస్కరించుకుని కుటుంబ సభ్యుల ఆధ్వర్యంలో ఉగ్రశాంతి కార్యక్రమాలను భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. బ్రహ్మశ్రీ ముడుంబై లక్ష్మీనారాయణాచార్యుల ఆధ్వర్యంలో ఆవాహిత కలశారాధన, రుద్రాభిషేకం, మూలమంత్ర హోమాలు, ఆయుష్య హోమం, మహాపూర్ణాహుతి, కలశ ఉద్వాసన, కలశస్నపనం, వేద ఆశీర్వచనం తదితర కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సందర్భంగా లక్ష్మీనారాయణాచార్యులు మాట్లాడుతూ.. కార్యక్రమంలో పాల్గొన్న కుటుంబ...