- ఎమ్మెల్సీ తక్కెళ్లపల్లి రవీందర్రావును కోరిన కౌన్సిలర్ శ్రీదేవి బాలు నాయక్
మహబూబాబాద్, అక్టోబరు 1 (చైతన్యగళం): మానుకోట మున్సిపాలిటీ పరిధిలోని 26వ వార్డులో డ్రైనేజీ వ్యవస్థ అభివృద్ధికి ఎమ్మెల్సీ నిధుల నుంచి రూ.20 లక్షలు కేటాయించాలని కోరుతూ కౌన్సిలర్ మాలోతు శ్రీదేవి బాలు నాయక్ ఎమ్మెల్సీ తక్కెళ్లపల్లి రవీందర్రావును కలిసి వినతిపత్రం అందజేశారు.
26వ వార్డులో మూడు కోట్ల ప్రాంతం నుంచి కాకతీయ కాలనీ వరకు సరైన డ్రైనేజీ వ్యవస్థ లేక ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని కౌన్సిలర్ తెలిపారు. మురుగు కాలువలు సక్రమంగా లేక పారిశుద్ధ్య సమస్యలు తలెత్తుతున్నాయని పేర్కొన్నారు. రూ.20 లక్షలు మంజూరైతే సైడ్ డ్రైనేజీ కాలువల అభివృద్ధికి వినియోగిస్తామని తెలిపారు.
ఎమ్మెల్సీ రవీందర్రావు స్పందిస్తూ ఎమ్మెల్సీలకు రావాల్సిన నిధుల కోసం ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డిని పలుమార్లు కోరినట్లు తెలిపారు. నిధులు త్వరలో విడుదలయ్యే అవకాశం ఉందని, అనంతరం 26వ వార్డు అభివృద్ధికి తనవంతు సహకారం అందిస్తానని హామీ ఇచ్చారు.
కార్యక్రమంలో మాలోతు బాలు నాయక్, అజ్మీర శ్రీకాంత్, చుక్క శ్యాంప్రసాద్, మార్నేని రఘు తదితరులు పాల్గొన్నారు.
