26వ వార్డులో డ్రైనేజీ అభివృద్ధికి రూ.20 లక్షలు మంజూరు చేయాలి

ఎమ్మెల్సీ తక్కెళ్లపల్లి రవీందర్‌రావును కోరిన కౌన్సిలర్‌ శ్రీదేవి బాలు నాయక్‌ మహబూబాబాద్‌, అక్టోబరు 1 (చైతన్యగళం): మానుకోట మున్సిపాలిటీ పరిధిలోని 26వ వార్డులో డ్రైనేజీ వ్యవస్థ అభివృద్ధికి ఎమ్మెల్సీ నిధుల నుంచి రూ.20 లక్షలు కేటాయించాలని కోరుతూ కౌన్సిలర్‌ మాలోతు శ్రీదేవి బాలు నాయక్‌ ఎమ్మెల్సీ తక్కెళ్లపల్లి రవీందర్‌రావును కలిసి వినతిపత్రం అందజేశారు. 26వ వార్డులో మూడు కోట్ల ప్రాంతం నుంచి కాకతీయ కాలనీ వరకు సరైన డ్రైనేజీ వ్యవస్థ లేక ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని కౌన్సిలర్‌ తెలిపారు. మురుగు కాలువలు సక్రమంగా లేక...