Friday, October 2, 2026
Homeతెలంగాణకరీంనగర్విద్యార్థులకు అల్పాహార కార్యక్రమం ప్రారంభం

విద్యార్థులకు అల్పాహార కార్యక్రమం ప్రారంభం

📰 Generate e-Paper Clip

  • కోహెడలో 3,444 మంది విద్యార్థులకు ప్రయోజనం: మండల కాంగ్రెస్‌ అధ్యక్షుడు శెట్టి సుధాకర్‌ పటేల్‌

కోహెడ, అక్టోబరు 1 (చైతన్యగళం): ప్రభుత్వ పాఠశాలలు, కళాశాలల్లో చదువుతున్న విద్యార్థులకు హరేకృష్ణ మూవ్‌మెంట్‌ చారిటబుల్‌ ఫౌండేషన్‌ సహకారంతో రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన అల్పాహార కార్యక్రమాన్ని గురువారం కోహెడ మండలంలో ప్రారంభించారు. నాగసముద్రాల మోడల్‌ స్కూల్‌లో సర్పంచ్‌ పెరుక సరిత రామచంద్రంతో కలిసి మండల కాంగ్రెస్‌ అధ్యక్షుడు శెట్టి సుధాకర్‌ పటేల్‌ విద్యార్థులకు అల్పాహారం అందించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యార్థుల సంక్షేమానికి ప్రాధాన్యమిస్తూ ప్రభుత్వం అల్పాహార కార్యక్రమాన్ని ప్రారంభించడం అభినందనీయమన్నారు. పేద కుటుంబాలకు చెందిన విద్యార్థులు ఆహారం కోసం ఇబ్బందులు పడకుండా చదువుపై దృష్టి సారించేందుకు ఈ కార్యక్రమం ఉపయోగపడుతుందని తెలిపారు. కోహెడ మండలంలోని 47 ప్రభుత్వ పాఠశాలలు, ఒక జూనియర్‌ కళాశాలలో మొత్తం 3,444 మంది విద్యార్థులకు ఈ పథకం ద్వారా ప్రయోజనం చేకూరుతుందని పేర్కొన్నారు.

హుస్నాబాద్‌ ఎమ్మెల్యే, రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్‌ సహకారంతో ఉమ్మడి కరీంనగర్‌ జిల్లాలోని పాఠశాలలు, కళాశాలల్లో అల్పాహార కార్యక్రమం అమలు చేస్తున్నందుకు విద్యార్థులు, తల్లిదండ్రుల తరఫున కృతజ్ఞతలు తెలిపారు.

కార్యక్రమంలో మార్కెట్‌ కమిటీ డైరెక్టర్‌ చింతలపల్లి జనార్దన్‌రెడ్డి, పాఠశాల ప్రిన్సిపల్‌, అధ్యాపకులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install CG News App

Add to home screen for faster loading and latest updates.

error: Content is protected !!