Friday, October 2, 2026
Homeక్రైమ్ న్యూస్భీమ్‌రెడ్డి బినామీలపై ఐటీ కేసులు

భీమ్‌రెడ్డి బినామీలపై ఐటీ కేసులు

📰 Generate e-Paper Clip

  • బినామీ ఆస్తుల చట్టం కింద 8 మందిపై కేసులు.. ఏసీబీ సమాచారంతో చర్యలు

హైదరాబాద్‌, సెప్టెంబరు 30 (చైతన్యగళం): మాజీ డీఎస్పీ సంకిరెడ్డి భీమ్‌రెడ్డి ఆస్తుల వ్యవహారంపై ఏసీబీ, ఆదాయపన్ను శాఖ అధికారులు దర్యాప్తును ముమ్మరం చేశారు. భీమ్‌రెడ్డికి బినామీలుగా అనుమానిస్తున్న ఎనిమిది మందిపై బినామీ ఆస్తుల చట్టం కింద ఆదాయపన్ను శాఖ కేసులు నమోదు చేసినట్లు సమాచారం. ఏసీబీ దర్యాప్తులో లభించిన వివరాల ఆధారంగా ఈ చర్యలు చేపట్టినట్లు తెలుస్తోంది.

ఇటీవల భీమ్‌రెడ్డికి సంబంధించిన ఎనిమిది మంది అనుమానిత బినామీల నివాసాలతో పాటు హైదరాబాద్‌, జహీరాబాద్‌లోని పలు ప్రాంతాల్లో ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహించారు. ఈ తనిఖీల్లో ఆస్తుల పత్రాలు, బ్యాంకు లావాదేవీల వివరాలు, ఇతర ఆర్థిక రికార్డులను పరిశీలించి కీలక ఆధారాలను స్వాధీనం చేసుకున్నట్లు ఏసీబీ వెల్లడించింది.

బినామీ ఆస్తుల వ్యవహారంపై ఏసీబీ అందించిన సమాచారాన్ని ఆధారంగా చేసుకుని ఆదాయపన్ను శాఖ తదుపరి చర్యలు చేపడుతున్నట్లు తెలుస్తోంది. భీమ్‌రెడ్డి ఆస్తులు, బినామీలుగా అనుమానిస్తున్న వ్యక్తుల ఆర్థిక లావాదేవీలపై దర్యాప్తు కొనసాగుతోంది.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install CG News App

Add to home screen for faster loading and latest updates.

error: Content is protected !!