Friday, October 23, 2026
Homeతెలంగాణకరీంనగర్ప్రజల సమస్యలను వెంటనే పరిష్కరించాలి.. ఉద్యోగులే ప్రభుత్వానికి ప్రతినిధులు: సీఎం రేవంత్‌రెడ్డి

ప్రజల సమస్యలను వెంటనే పరిష్కరించాలి.. ఉద్యోగులే ప్రభుత్వానికి ప్రతినిధులు: సీఎం రేవంత్‌రెడ్డి

📰 Generate e-Paper Clip

కరీంనగర్‌, సెప్టెంబరు 30 (చైతన్యగళం): సంక్షేమ పథకాల ఫలాలు పేదలకు పూర్తిస్థాయిలో అందేలా ఉద్యోగులు పనిచేయాలని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి సూచించారు. బుధవారం కరీంనగర్‌లో నూతన సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయాన్ని ప్రారంభించిన అనంతరం ఆయన మాట్లాడారు. కలెక్టరేట్‌ ఎదుట తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఆవిష్కరించి, పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు.

ప్రభుత్వ సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను క్షేత్రస్థాయికి తీసుకెళ్లేది ఉద్యోగులేనని సీఎం అన్నారు. ప్రభుత్వానికి మంచి పేరు వచ్చినా, చెడ్డపేరు వచ్చినా అందులో ఉద్యోగుల పాత్ర ఉంటుందని పేర్కొన్నారు. ఉద్యోగుల సమస్యలను పరిష్కరిస్తున్నామని, మిగిలిన సమస్యలను కూడా పరిష్కరిస్తామని తెలిపారు. ఉద్యోగుల సంక్షేమం కోసం రూ.944 కోట్లతో పనులు ప్రారంభించుకున్నట్లు చెప్పారు.

సహాయం కోసం కార్యాలయాలకు వచ్చే పేదలను కుటుంబ సభ్యులుగా భావించి వారి సమస్యలను సత్వరం పరిష్కరించాలని సూచించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సమన్వయంతో సంక్షేమ కార్యక్రమాలను అమలు చేస్తున్నామని తెలిపారు. ఎన్నికల సమయంలోనే అభివృద్ధి కార్యక్రమాలను రాజకీయ అంశాలుగా చూడాలని, ఎన్నికలు లేని సమయంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పరస్పర సహకారంతో పనిచేయాలని సీఎం రేవంత్‌రెడ్డి పేర్కొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install CG News App

Add to home screen for faster loading and latest updates.

error: Content is protected !!