Friday, October 23, 2026
Homeతెలంగాణరంగారెడ్డిబీజేవైఎం రంగారెడ్డి జిల్లా కార్యదర్శిగా కాకరాల చైతన్య గౌడ్

బీజేవైఎం రంగారెడ్డి జిల్లా కార్యదర్శిగా కాకరాల చైతన్య గౌడ్

📰 Generate e-Paper Clip

  • రాష్ట్ర, జిల్లా అధ్యక్షుల ఆమోదంతో నూతన జిల్లా కమిటీ ప్రకటన

రంగారెడ్డి, అక్టోబర్ 23 (చైతన్యగళం‌): భారతీయ జనతా యువ మోర్చా (బీజేవైఎం) రంగారెడ్డి జిల్లా (అర్బన్‌) కార్యదర్శిగా వనస్థలిపురానికి చెందిన కాకరాల చైతన్య గౌడ్‌ నియమితులయ్యారు. బీజేవైఎం రాష్ట్ర అధ్యక్షుడు గణేశ్‌ కుండే ఆమోదంతో, బీజేపీ రంగారెడ్డి జిల్లా (అర్బన్‌) అధ్యక్షుడు వనిపల్లి శ్రీనివాస్‌ రెడ్డి సూచనల మేరకు జిల్లా కమిటీని ప్రకటించారు. ఈ మేరకు విడుదల చేసిన నియామకాల జాబితాలో చైతన్య గౌడ్‌కు జిల్లా కార్యదర్శిగా బాధ్యతలు అప్పగించారు.

ఈ సందర్భంగా బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు కొత్త రవీందర్‌ గౌడ్‌, బీజేవైఎం రంగారెడ్డి జిల్లా అధ్యక్షుడు పొట్లపల్లి సాయిరాం గౌడ్‌ నాయకత్వంలో యువ మోర్చా కార్యకలాపాలను మరింత బలోపేతం చేయాలని పార్టీ శ్రేణులు ఆకాంక్షించాయి. యువతను పార్టీ కార్యక్రమాల్లో భాగస్వాములను చేస్తూ, ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి చేయడంలో నూతన కమిటీ కీలక పాత్ర పోషించాలని నాయకులు అభిప్రాయపడ్డారు.

జిల్లా కార్యదర్శిగా నియమితులైన కాకరాల చైతన్య గౌడ్‌కు పార్టీ నాయకులు, యువ మోర్చా కార్యకర్తలు శుభాకాంక్షలు తెలిపారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install CG News App

Add to home screen for faster loading and latest updates.

error: Content is protected !!