భీమ్‌రెడ్డి బినామీలపై ఐటీ కేసులు
బినామీ ఆస్తుల చట్టం కింద 8 మందిపై కేసులు.. ఏసీబీ సమాచారంతో చర్యలు హైదరాబాద్, సెప్టెంబరు 30 (చైతన్యగళం): మాజీ డీఎస్పీ సంకిరెడ్డి భీమ్‌రెడ్డి ఆస్తుల వ్యవహారంపై ఏసీబీ, ఆదాయపన్ను శాఖ అధికారులు దర్యాప్తును ముమ్మరం చేశారు. భీమ్‌రెడ్డికి బినామీలుగా అనుమానిస్తున్న ఎనిమిది మందిపై బినామీ ఆస్తుల చట్టం కింద ఆదాయపన్ను శాఖ కేసులు నమోదు చేసినట్లు సమాచారం. ఏసీబీ దర్యాప్తులో లభించిన వివరాల ఆధారంగా ఈ చర్యలు చేపట్టినట్లు తెలుస్తోంది. ఇటీవల భీమ్‌రెడ్డికి సంబంధించిన ఎనిమిది మంది అనుమానిత బినామీల నివాసాలతో పాటు...