Tuesday, September 29, 2026
Homeతెలంగాణఎస్సీ, ఎస్టీ మహిళలకు ఉచిత కుట్టు మిషన్లు అందించాలి

ఎస్సీ, ఎస్టీ మహిళలకు ఉచిత కుట్టు మిషన్లు అందించాలి

📰 Generate e-Paper Clip

హుస్నాబాద్, సెప్టెంబర్ 29 (చైతన్యగళం):

తెలంగాణ రాష్ట్రంలోని నిరుపేద ఎస్సీ, ఎస్టీ మహిళలకు 100 శాతం సబ్సిడీతో కుట్టు మిషన్లు ఉచితంగా పంపిణీ చేయాలని తెలంగాణ అంబేద్కర్ సంఘం రాష్ట్ర కమిటీ పక్షాన రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నామని ఆ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చెప్యాల ప్రకాష్ తెలిపారు. ప్రకాష్ మాట్లాడుతూ, భారతదేశంలో కొనసాగుతున్న సామాజిక, ఆర్థిక అసమానతల కారణంగా దళితులు, గిరిజనులు ఇప్పటికీ అనేక రంగాల్లో వెనుకబడి ఉన్నారని అన్నారు. స్వాతంత్ర్యం వచ్చి 78 సంవత్సరాలు గడిచినా నిరుపేద దళిత, గిరిజన కుటుంబాల ఆర్థిక పరిస్థితుల్లో ఆశించిన స్థాయిలో మార్పు రాలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ముఖ్యంగా దళిత, గిరిజన మహిళలు ఆర్థికంగా స్వయం సమృద్ధి సాధించేందుకు ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందన్నారు. కుట్టు మిషన్లు అందించడం ద్వారా మహిళలకు స్వయం ఉపాధి కల్పించి, కుటుంబ ఆదాయాన్ని పెంచుకునే అవకాశం కల్పించవచ్చని తెలిపారు. తెలంగాణ ప్రభుత్వం బీసీ వర్గాల మహిళలకు ఏ విధంగా సబ్సిడీతో కుట్టు మిషన్లను అందిస్తుందో, అదే విధంగా ఎస్సీ, ఎస్టీ మహిళలకు కూడా 100 శాతం సబ్సిడీతో కుట్టు మిషన్లు అందించే ప్రత్యేక పథకాన్ని వెంటనే ప్రారంభించాలని డిమాండ్ చేశారు. ఎస్సీ సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్, పంచాయతీరాజ్ శాఖ మంత్రి దాసరి సీతక్క ప్రత్యేక చొరవ తీసుకుని, ముఖ్యమంత్రి, ఉపముఖ్యమంత్రి, సంబంధిత మంత్రులు మరియు ఎమ్మెల్యేలతో చర్చించి ఎస్సీ, ఎస్టీ మహిళలకు ఉచిత కుట్టు మిషన్లు అందించేలా చర్యలు తీసుకోవాలని కోరారు. అవసరమైతే ఈ అంశంపై రాష్ట్ర మంత్రివర్గం ప్రత్యేకంగా చర్చించి, ఎస్సీ, ఎస్టీ మహిళల కోసం ప్రత్యేక కుట్టు మిషన్ పంపిణీ పథకాన్ని ప్రకటించాలని తెలంగాణ అంబేద్కర్ సంఘం రాష్ట్ర కమిటీ విజ్ఞప్తి చేస్తోందన్నారు.

 

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install CG News App

Add to home screen for faster loading and latest updates.

error: Content is protected !!