కరీంనగర్, సెప్టెంబర్ 29 (చైతన్యగళం): కట్టారాంపూర్‌లో కరీంనగర్ పట్టణ ముదిరాజ్ సంఘం గౌరవాధ్యక్షుడు, రాంపూర్ మాజీ సర్పంచ్ పిట్టల లింగయ్య ఇటీవల మృతి చెందారు. ఆయన కుటుంబ సభ్యులను కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ పరామర్శించారు. ఈ కార్యక్రమంలో మేయర్ కొలగాని శ్రీనివాస్, డిప్యూటీ మేయర్ సునీల్ రావు, కార్పొరేటర్లు పాల్గొన్నారు.
