Tuesday, September 29, 2026
Homeతెలంగాణకరీంనగర్సీఎం వ్యాఖ్యల పై బీజేపీ నిరసన

సీఎం వ్యాఖ్యల పై బీజేపీ నిరసన

📰 Generate e-Paper Clip

కరీంనగర్, సెప్టెంబర్ 29 (చైతన్యగళం): హిందూ దేవుళ్లపై సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలను నిరసిస్తూ బీజేపీ ఆధ్వర్యంలో కరీంనగర్ జిల్లావ్యాప్తంగా ఆందోళనలు నిర్వహించారు. మండల కేంద్రాల్లో సీఎం దిష్టిబొమ్మలను దహనం చేశారు. జిల్లా కేంద్రంలోని కోర్టు చౌరస్తాలో నిర్వహించిన నిరసనలో బీజేపీ సీనియర్ నాయకులు గుజ్జ శ్రీనివాసరావు మాట్లాడుతూ హిందూ దేవుళ్లపై చేసిన వ్యాఖ్యలను సీఎం వెంటనే వెనక్కి తీసుకుని హిందూ సమాజానికి క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. దేవుళ్ల మధ్య విభేదాలు సృష్టించేలా వ్యాఖ్యలు చేయడం సరికాదన్నారు. కార్యక్రమంలో **ఇనుగొండ నాగేశ్వర్ రెడ్డి, గుర్రాల వెంకట్ రెడ్డి, బత్తుల లక్ష్మినారాయణ, నరెడ్ల ప్రవీణ్ రెడ్డి, సంగ నరేష్**, బీజేపీ నాయకులు, కార్పొరేటర్లు, మండల అధ్యక్షులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

 

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install CG News App

Add to home screen for faster loading and latest updates.

error: Content is protected !!