Wednesday, September 30, 2026
Homeతెలంగాణసాహితీ సేవకు స్వర్ణ నంది పురస్కారం

సాహితీ సేవకు స్వర్ణ నంది పురస్కారం

📰 Generate e-Paper Clip

  • సమ్మెట వెంకటేశ్వర్లుకు అరుదైన గౌరవం

మహబూబాబాద్‌ అర్బన్‌, సెప్టెంబరు 28(చైతన్యగళం): విద్యా, సాహితీ రంగాల్లో విశిష్ట సేవలందించిన మహబూబాబాద్‌ జిల్లాకు చెందిన విశ్రాంత ప్రధానోపాధ్యాయులు, సాహితీవేత్త సమ్మెట వెంకటేశ్వర్లుకు స్వర్ణ నంది పురస్కారం లభించింది. హైదరాబాద్‌ కూకట్‌పల్లిలోని బిర్లా ఆడిటోరియంలో నిర్వహించిన కార్యక్రమంలో ఆయనకు పురస్కారాన్ని ప్రదానం చేశారు.

మెగా హెల్పింగ్‌ హ్యాండ్స్‌ అండ్‌ మెగా ఈవెంట్స్‌ ఆధ్వర్యంలో విద్య, సాహిత్యం, సంస్కృతి, నృత్యం, జర్నలిజం తదితర రంగాల్లో ప్రతిభ కనబరిచిన వారిని ఏటా స్వర్ణ నంది, కీర్తి ఐకాన్‌ పురస్కారాలతో సత్కరిస్తున్నారు. ఈ ఏడాది రెండు తెలుగు రాష్ట్రాలకు చెందిన 32 మందిని ఎంపిక చేశారు.

సినీ నటుడు గౌతంరాజు, తెలంగాణ ఫిలిం ఛాంబర్‌ చైర్మన్‌ పి. రామకృష్ణగౌడ్‌, విశ్రాంత ఎస్పీ ఎస్‌.ఎం. రత్న, ‘విశ్వక్‌’ చిత్ర దర్శకుడు వేణు, జాతీయ కబడ్డీ క్రీడాకారిణి, సినీ నటి జ్యోత్స్న, మెగా హెల్పింగ్‌ ఫౌండేషన్‌ చైర్మన్‌, టీవీ కళాకారిణి శిరీషారెడ్డి తదితరుల చేతుల మీదుగా వెంకటేశ్వర్లు పురస్కారం అందుకున్నారు. ఈ సందర్భంగా జిల్లా సాహితీవేత్తలు, విద్యావేత్తలు, సాహితీ అభిమానులు హర్షం వ్యక్తం చేశారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install CG News App

Add to home screen for faster loading and latest updates.

error: Content is protected !!