హైదరాబాద్, సెప్టెంబరు 23 (చైతన్యగళం): మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి వ్యవస్థాపక జాతీయ అధ్యక్షుడు పద్మశ్రీ మంద కృష్ణ మాదిగను బోడుప్పల్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు దానగాళ్ల యాదగిరి బృందంతో కలిసి బుధవారం నల్లకుంటలో మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా మంద కృష్ణ మాదిగను శాలువాతో సన్మానించారు.
ఈ సందర్భంగా దానగాళ్ల యాదగిరి మాట్లాడుతూ.. ఎస్సీ వర్గీకరణ అమలులో మంద కృష్ణ మాదిగ చేసిన పోరాటం కీలకమని పేర్కొన్నారు. పేద, మధ్యతరగతి కుటుంబాలకు ఆరోగ్యశ్రీ ద్వారా కార్పొరేట్ ఆసుపత్రుల్లో ఉచిత వైద్యం అందుబాటులోకి రావడానికి మంద కృష్ణ మాదిగ పోరాటం కూడా కారణమని ఆయన పేర్కొన్నారు.
కార్యక్రమంలో ఆలేరు మాజీ చైర్మన్ వసూరి శంకరయ్య, పీసీసీ కార్యదర్శి శివకుమార్, గోపు రాములు తదితరులు పాల్గొన్నారు.
