మంద కృష్ణ మాదిగను మర్యాదపూర్వకంగా కలిసిన దానగాళ్ల యాదగిరి
హైదరాబాద్, సెప్టెంబరు 23 (చైతన్యగళం): మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి వ్యవస్థాపక జాతీయ అధ్యక్షుడు పద్మశ్రీ మంద కృష్ణ మాదిగను బోడుప్పల్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు దానగాళ్ల యాదగిరి బృందంతో కలిసి బుధవారం నల్లకుంటలో మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా మంద కృష్ణ మాదిగను శాలువాతో సన్మానించారు. ఈ సందర్భంగా దానగాళ్ల యాదగిరి మాట్లాడుతూ.. ఎస్సీ వర్గీకరణ అమలులో మంద కృష్ణ మాదిగ చేసిన పోరాటం కీలకమని పేర్కొన్నారు. పేద, మధ్యతరగతి కుటుంబాలకు ఆరోగ్యశ్రీ ద్వారా కార్పొరేట్ ఆసుపత్రుల్లో ఉచిత వైద్యం అందుబాటులోకి...