Thursday, September 24, 2026
Homeతెలంగాణహైదరాబాద్రాజీవ్‌నగర్‌లో ఘనంగా మహా అన్నదానం

రాజీవ్‌నగర్‌లో ఘనంగా మహా అన్నదానం

📰 Generate e-Paper Clip

  • కార్యక్రమాన్ని ప్రారంభించిన కాంగ్రెస్‌ సీనియర్‌ నాయకుడు దానగాళ్ల యాదగిరి

బోడుప్పల్‌, సెప్టెంబరు 23 (చైతన్యగళం): గణేష్‌ నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా బోడుప్పల్‌ రాజీవ్‌నగర్‌ కాలనీ యూత్‌ వింగ్‌ అసోసియేషన్‌ ఆధ్వర్యంలో బుధవారం మహా అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. కాంగ్రెస్‌ సీనియర్‌ నాయకుడు దానగాళ్ల యాదగిరి ముఖ్యఅతిథిగా హాజరై అన్నదానాన్ని ప్రారంభించారు.

ఈ సందర్భంగా దానగాళ్ల యాదగిరి మాట్లాడుతూ.. అన్ని దానాల్లో అన్నదానం గొప్పదని అన్నారు. మహా అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించిన గడ్డి రమేష్‌, నాగరాజులను అభినందించారు. అనంతరం యూత్‌ వింగ్‌ కమిటీ సభ్యులు దానగాళ్ల యాదగిరిని శాలువాతో సన్మానించారు. ఆయన కూడా కమిటీ సభ్యులను శాలువాలతో సత్కరించారు.

కార్యక్రమంలో రాపోలు రాములు, కాంగ్రెస్‌ పార్టీ బీ-బ్లాక్‌ ఇన్‌చార్జి కొత్త కిషోర్‌గౌడ్‌, కాంగ్రెస్‌ డివిజన్‌ అధ్యక్షుడు బొమ్మక్‌ కళ్యాణ్‌, రాసాల పృథ్వీయాదవ్‌, వెంకటచారి, గోపు రాములు, నానాజీ, డబుల్‌ బెడ్‌రూమ్‌ అసోసియేషన్‌ సభ్యులు, రాజీవ్‌నగర్‌ యూత్‌ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install CG News App

Add to home screen for faster loading and latest updates.

error: Content is protected !!