- డెంగ్యూ, టైఫాయిడ్ నియంత్రణకు ప్రత్యేక చర్యలు
హుస్నాబాద్, సెప్టెంబరు 22 (చైతన్యగళం): డెంగ్యూ, టైఫాయిడ్ తదితర విషజ్వరాల నివారణ, నియంత్రణకు కార్యాచరణ ప్రణాళిక రూపొందించారు. డీఎంహెచ్‌వో, సిద్దిపేట జిల్లా పర్యవేక్షణలో హుస్నాబాద్ పట్టణంలోని బస్తీ దవాఖానా వద్ద మంగళవారం నిర్వహించిన కార్యక్రమంలో మున్సిపల్ అధికారులు, ఆశా కార్యకర్తలు, ఏఎన్‌ఎంలకు జ్వరాల నివారణ, గుర్తింపు, ముందస్తు జాగ్రత్తలపై సూచనలు అందించారు.
మున్సిపల్, వైద్య ఆరోగ్యశాఖల సిబ్బంది సమన్వయంతో పట్టణంలో పారిశుద్ధ్య చర్యలు, మందుల పిచికారీ, పొగమందు పిచికారీ, ప్రత్యేక శుభ్రత కార్యక్రమాలు చేపట్టాలని నిర్ణయించారు. దోమల సమస్య, నీరు నిల్వ ఉండటం, పారిశుద్ధ్య లోపాలు గుర్తించిన ప్రాంతాల్లో వెంటనే తగిన చర్యలు చేపట్టాలని సూచించారు. ప్రజలు తమ పరిసరాల్లో సమస్యలను గుర్తించిన వెంటనే సంబంధిత అధికారుల దృష్టికి తీసుకురావాలని కోరారు.
కార్యక్రమంలో మున్సిపల్ చైర్‌పర్సన్ దండి లక్ష్మీ, కమిషనర్ మల్లికార్జున్, వైస్ చైర్‌పర్సన్ పద్మ, కౌన్సిలర్లు శ్రీనివాస్, సంపత్, వైద్య సిబ్బంది పాల్గొన్నారు.
