Monday, September 21, 2026
Homeతెలంగాణగణేష్ నిమజ్జనంపై మండపాల నిర్వాహకులకు అవగాహన

గణేష్ నిమజ్జనంపై మండపాల నిర్వాహకులకు అవగాహన

📰 Generate e-Paper Clip

హుస్నాబాద్, సెప్టెంబర్ 21 (చైతన్యగళం):

గణేష్ నిమజ్జనం సందర్భంగా హుస్నాబాద్ పోలీస్ స్టేషన్‌లో గణేష్ మండపాల నిర్వాహకులతో అవగాహన సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సీఐ శ్రీధర్ మాట్లాడుతూ నిమజ్జనాన్ని శాంతియుతంగా, సురక్షితంగా నిర్వహించాలని సూచించారు. అధికారులు సూచించిన ప్రదేశాల్లోనే నిమజ్జనం చేయాలని, ప్రమాదకర నీటి ప్రాంతాల్లోకి వెళ్లకుండా జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. పిల్లలు, వృద్ధులు, ఈత రాని వారు నీటిలోకి వెళ్లకుండా చూడాలని, ట్రాక్టర్లు, ట్రాలీలు, లారీలపై అధిక సంఖ్యలో ప్రయాణించకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. ఊరేగింపు సమయంలో ట్రాఫిక్‌కు అంతరాయం కలగకుండా పోలీసుల సూచనలు పాటించాలని, డీజేలు ఉపయోగించకుండా నిబంధనలకు అనుగుణంగా సౌండ్ సిస్టమ్‌ను వినియోగించాలని తెలిపారు. మద్యం సేవించి వాహనాలు నడపరాదని, విద్యుత్ తీగలు, ట్రాన్స్‌ఫార్మర్ల వద్ద అప్రమత్తంగా ఉండాలని సూచించారు. పూజా సామగ్రి, వ్యర్థాలను నీటిలో వేయకుండా పర్యావరణహితంగా నిమజ్జనం చేయాలని, ఏదైనా అవాంఛనీయ ఘటన జరిగితే వెంటనే పోలీసులకు

 

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install CG News App

Add to home screen for faster loading and latest updates.

error: Content is protected !!