Saturday, November 28, 2026
Homeతెలంగాణదీక్షా దివస్ సభను విజయవంతం చేయాలి

దీక్షా దివస్ సభను విజయవంతం చేయాలి

📰 Generate e-Paper Clip

  • పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేసిన మాజీ ఎమ్మెల్యే వొడితల సతీష్ కుమార్

హుస్నాబాద్, నవంబర్ 27 (చైతన్యగళం):

ఈ నెల 29న కరీంనగర్ జిల్లా అలుగునూరులో బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించనున్న దీక్షా దివస్ సభను విజయవంతం చేయాలని మాజీ ఎమ్మెల్యే, బీఆర్ఎస్ హుస్నాబాద్ నియోజకవర్గ ఇన్‌చార్జి వొడితల సతీష్ కుమార్ పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. ఈ మేరకు గురువారం హుస్నాబాద్ పట్టణంలోని బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో నాయకులు, కార్యకర్తలతో ముందస్తు సమీక్ష సమావేశం నిర్వహించారు.

సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరైన సతీష్ కుమార్ పార్టీ నాయకులు, కార్యకర్తలకు దిశానిర్దేశం చేశారు. పార్టీ బలోపేతం, దీక్షా దివస్ సభకు నాయకులు, కార్యకర్తల సమీకరణ, సభ నిర్వహణకు చేపట్టాల్సిన ఏర్పాట్లు, భవిష్యత్తు కార్యాచరణ తదితర అంశాలపై చర్చించారు.

నవంబర్ 29న జరిగే సభకు హుస్నాబాద్ నియోజకవర్గంలోని అన్ని మండలాలు, గ్రామాల నుంచి పార్టీ నాయకులు, ప్రజాప్రతినిధులు, మాజీ ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో హాజరయ్యేలా సమన్వయంతో పనిచేయాలని సూచించారు.

ఈ సమావేశంలో ప్రజాప్రతినిధులు, మాజీ ప్రజాప్రతినిధులు, పార్టీ నాయకులు, వివిధ మండలాల అధ్యక్షులు, సీనియర్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install CG News App

Add to home screen for faster loading and latest updates.

error: Content is protected !!