కల్వకుర్తి, జూలై 17 (చైతన్యగళం):
కల్వకుర్తి మండల పరిధిలోని లింగసానిపల్లి గ్రామ వాగు నుండి అక్రమంగా ఇసుకను తరలిస్తున్న ట్రాక్టర్‌ను గురువారం రాత్రి పోలీసులు పట్టుకున్నారు. తర్ణికల్ వద్ద వాహనాన్ని ఆపి స్వాధీనం చేసుకున్న అనంతరం కల్వకుర్తి పోలీస్ స్టేషన్‌కు తరలించారు.ఈ సందర్భంగా ఎస్ఐ కురుమూర్తి మాట్లాడుతూ, “అక్రమంగా ఇసుక రవాణా చేస్తే కఠిన చర్యలు తప్పవు” అని హెచ్చరించారు. ట్రాక్టర్ యజమాని, డ్రైవర్‌పై కేసు నమోదు చేసినట్లు శుక్రవారం మీడియాకు వివరాలు వెల్లడించారు.
అక్రమ ఇసుక రవాణాపై కేసు నమోదు
RELATED ARTICLES
