Friday, July 17, 2026
Homeక్రైమ్ న్యూస్రోడ్డు భద్రత నియమాలు పాటించాలి : CI సత్యనారాయణ

రోడ్డు భద్రత నియమాలు పాటించాలి : CI సత్యనారాయణ

📰 Generate e-Paper Clip

మీరఖాన్‌పేట్ లో వాహన తనిఖీలు – ప్రజలకు అవగాహన కల్పించిన పోలీసులు

కందుకూరు ,జూలై 17 (చైతన్యగళం): భద్రత నియమాలు పాటిస్తే రోడ్డు ప్రమాదాలు నివారించవచ్చునని హైదారాబాద్ గ్రీన్ ఫార్మాసిటీ CI సత్యనారాయణ అన్నారు. కందుకూరు మండలం మీరఖాన్‌పేట్ గ్రామంలో రోడ్డు భద్రత అవగాహన … ప్రజల భద్రత మరియు శాంతిభద్రతల పరిరక్షణలో భాగంగా శుక్రవారం మీరఖాన్‌పేట్ గ్రామంలో పోలీసులు ప్రత్యేక వాహన తనిఖీ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా వాహనదారులు మరియు ప్రజలకు రోడ్డు భద్రతా నియమాలు, హెల్మెట్ మరియు సీట్‌బెల్ట్ వినియోగం, అతివేగం, మద్యం సేవించి వాహనాలు నడపడం వల్ల కలిగే ప్రమాదాలపై అవగాహన కల్పించారు. అలాగే సైబర్ నేరాలు, ఆన్‌లైన్ మోసాలు, OTP, KYC, డిజిటల్ అరెస్టు, పెట్టుబడి మోసాలు, అశ్లీల (పోర్నోగ్రఫీ) వెబ్‌సైట్లు మరియు సోషల్ మీడియా ద్వారా జరిగే నేరాల పట్ల అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
ట్రాఫిక్ నిబంధనలు పాటించడం వేగ పరిమితులకు లోబడి డ్రైవింగ్ చేయడం హెల్మెట్ సీట్ బెల్ట్ ధరించడం, మధ్యo సేవించి వాహనం నడపరాదన్నారు. రహదారుల భద్రత అనేది ఒకరి బాధ్యత మాత్రమే కాదని, ప్రతి పౌరుడు బాధ్యత మాత్రం అన్నారు. కుటుంబ సభ్యులు తమకోసం వేయికళ్లతో ఇంటి దగ్గర ఎదురు చూస్తున్నారని విషయాన్ని గుర్తుంచుకోవాలన్నారు.ఇంటికి తాళం ఫోన్ పౌచ్ , తలకు హెల్మెట్ కంపల్సరిగా పెట్టుకునే విధంగా చూడాలని అన్నారు. మందు తాగి వాహనదారుడు వాహనం నడపకూడదని, డ్రైవ్ లో అధిక మొత్తంలో కేసు నమోదు అవుతున్నాయని CI సత్యనారాయణ పేర్కొన్నారు.
వాహన తనిఖీలలో ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించిన వాహనదారులపై ఈ-చలాన్లు విధించినారు. ప్రజల సహకారంతో నేరాల నివారణ, రోడ్డు భద్రత మరియు సైబర్ నేరాల నియంత్రణ లక్ష్యంగా ఇటువంటి ప్రత్యేక తనిఖీలు, అవగాహన కార్యక్రమాలు నిరంతరం కొనసాగుతాయని పోలీసులు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎస్ఐలు డి. సునీల్ కుమార్, జి సైదులు తో పాటు పోలీస్ స్టేషన్ సిబ్బంది ఉన్నారు.

RELATED ARTICLES

Most Popular

App Icon

Install CG News App

Add to home screen for faster loading and latest updates.

error: Content is protected !!