Sunday, August 9, 2026
Homeతెలంగాణఓటరు జాబితా సవరణ ప్రక్రియను వేగవంతం చేయాలి

ఓటరు జాబితా సవరణ ప్రక్రియను వేగవంతం చేయాలి

📰 Generate e-Paper Clip

ఏఎంసీ వైస్ చెర్మన్ సాదుల పవన్ కుమార్

నంగునూరు,జులై 13(చైతన్యగళం): నంగునూర్ ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (ఎస్‌ఐఆర్) ప్రక్రియను వేగవంతంగా,పారదర్శకంగా పూర్తి చేయాలని ఏఎంసీ వైస్ చైర్మన్ సాదుల పవన్ కుమార్ సంబంధిత అధికారులకు సూచించారు. ఎన్యూమరేషన్ ఫారాల డిజిటలైజేషన్‌ను అత్యంత కచ్చితత్వంతో పూర్తి చేయాలని, ప్రతి దరఖాస్తును నిశితంగా పరిశీలించాలని ఆదేశించారు. ఈ మేరకు సోమవారం సాదుల పవన్ కుమార్, నంగునూరు మండల కేంద్రంలో పర్యటించి, ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ కార్యక్రమం పురోగతిని పరిశీలించారు. ఇంటింటికీ ఎన్యూమరేషన్ ఫారాల పంపిణీ, సేకరణ ఎలా జరుగుతోందో క్షేత్రస్థాయిలో పరిశీలించడంతో పాటు, హెల్ప్‌డెస్క్‌ల పనితీరును కూడా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా బూత్ లెవల్ ఆఫీసర్లు (బీఎల్‌వోలు), సిబ్బందితో మాట్లాడి ప్రక్రియలో ఎదురవుతున్న సమస్యలను అడిగి తెలుసుకున్నారు.ఈ కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి నితీష్, జీపీఓ దేవరాజు,ఎఫ్ ఏ నరసింగరావు, బిఎల్ఓలురాజమల్లవ్వ,విమల,లక్ష్మి, లక్ష్మి, రేణుకా, జహీర్, స్వప్న,సుజాత,లావణ్య, బిల్ కలెక్టర్ అశోక్ కుమార్, లవన్ కుమార్, గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

Most Popular

App Icon

Install CG News App

Add to home screen for faster loading and latest updates.

error: Content is protected !!