ఓటరు జాబితా సవరణ ప్రక్రియను వేగవంతం చేయాలి
ఏఎంసీ వైస్ చెర్మన్ సాదుల పవన్ కుమార్ నంగునూరు,జులై 13(చైతన్యగళం): నంగునూర్ ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (ఎస్‌ఐఆర్) ప్రక్రియను వేగవంతంగా,పారదర్శకంగా పూర్తి చేయాలని ఏఎంసీ వైస్ చైర్మన్ సాదుల పవన్ కుమార్ సంబంధిత అధికారులకు సూచించారు. ఎన్యూమరేషన్ ఫారాల డిజిటలైజేషన్‌ను అత్యంత కచ్చితత్వంతో పూర్తి చేయాలని, ప్రతి దరఖాస్తును నిశితంగా పరిశీలించాలని ఆదేశించారు. ఈ మేరకు సోమవారం సాదుల పవన్ కుమార్, నంగునూరు మండల కేంద్రంలో పర్యటించి, ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ కార్యక్రమం పురోగతిని పరిశీలించారు. ఇంటింటికీ ఎన్యూమరేషన్...