Thursday, July 9, 2026
Homeతెలంగాణకొణిజేటి రోశయ్య సేవలు చిరస్మరణీయం

కొణిజేటి రోశయ్య సేవలు చిరస్మరణీయం

📰 Generate e-Paper Clip

షాద్‌నగర్, జూలై 4 (చైతన్యగళం): షాద్‌నగర్‌లోని వాసవి కన్యకా పరమేశ్వరి ఆవరణలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, నిరాడంబర నాయకుడు, రాజకీయ ధీశాలి కొణిజేటి రోశయ్య 93వ జయంతి వేడుకలు శనివారం అత్యంత ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా పలువురు ప్రముఖులు ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.వక్తలు రోశయ్య రాజకీయ ప్రస్థానాన్ని స్మరించుకుంటూ, ప్రజా సేవలో ఆయన చూపిన నిబద్ధతను కొనియాడారు. దశాబ్దాల పాటు ఆర్థిక మంత్రిగా, ముఖ్యమంత్రిగా రాష్ట్ర అభివృద్ధికి ఆయన అందించిన సేవలు చిరస్మరణీయమని పేర్కొన్నారు. వివాదాలకు తావులేకుండా, అత్యంత సంయమనంతో రాజకీయాలను నడిపిన ఆయన శైలి నేటి తరానికి ఆదర్శమని అన్నారు.ఈ కార్యక్రమంలో రంగారెడ్డి జిల్లా ఆర్యవైశ్య మహాసభ అధ్యక్షులు గందె సురేష్, తెలంగాణ ఆర్యవైశ్య మహాసభ మీడియా కమిటీ చైర్మన్ సారపు రమేష్ కుమార్, షాద్‌నగర్ ఆర్యవైశ్య సంఘం సలహా సంఘం సభ్యులు ఏంసాని శ్రీనివాస్, వాసవి క్లబ్ ప్రతినిధులు పాండురంగయ్య, గుంత సత్యనారాయణ, సోమ శ్రీనివాస్, గజవాడ యశ్వంత్ రాజ్, గుడుపల్లి రమణ, సామాజిక కార్యకర్త నీల రవీందర్, ఫరూక్ నగర్ మండల ఆర్యవైశ్య సంఘం అధ్యక్షులు ఎల్కుర్తి నారాయణ, రంగారెడ్డి జిల్లా మెంబర్షిప్ కమిటీ చైర్మన్ మలిపెద్ది శ్రీనివాస్, యమ శ్రీనివాస్, హరిబాబు, వీరేష్ పాల్గొన్నారు.అలాగే తెలంగాణ మహిళా విభాగ్ సభ్యులు సరాపు అనంతలక్ష్మి, వేముల శారద, వనితా క్లబ్ అధ్యక్షురాలు చంద్రిక తదితరులు పాల్గొని రోశయ్యకు నివాళులర్పించారు. ఆయన చూపిన మార్గంలో ప్రతి ఒక్కరూ సామాజిక సేవలో ముందుకు సాగాలని వక్తలు పిలుపునిచ్చారు.

RELATED ARTICLES

Most Popular

App Icon

Install CG News App

Add to home screen for faster loading and latest updates.

error: Content is protected !!