Thursday, July 9, 2026
Homeతెలంగాణనాగర్‌కర్నూల్ జిల్లా కేంద్రంలో భరోసా సెంటర్ ప్రారంభించిన మంత్రి పొన్నం ప్రభాకర్

నాగర్‌కర్నూల్ జిల్లా కేంద్రంలో భరోసా సెంటర్ ప్రారంభించిన మంత్రి పొన్నం ప్రభాకర్

📰 Generate e-Paper Clip

నాగర్ కర్నూల్ జూలై 8( చైతన్యగళం): రాష్ట్ర రవాణా మరియు బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ , జిల్లా కలెక్టర్ హేమంత కేశవ్ పాటిల్, జిల్లా ఎస్పీ నాగర్‌కర్నూల్ ఎమ్మెల్యే డా. కూచుకుళ్ల రాజేష్ రెడ్డి, ఎమ్మెల్సీ డా. కూచుకుళ్ల దామోదర్ రెడ్డి తో కలిసి నాగర్‌కర్నూల్ జిల్లా కేంద్రంలో బాలలు మరియు మహిళల కోసం ఏర్పాటు చేసిన భరోసా సెంటర్‌ను ప్రారంభించారు.ఈ సందర్భంగా మంత్రి పొన్నం ప్రభాకర్, మాట్లాడుతూ, మహిళలు మరియు బాలలకు రక్షణ, న్యాయ సహాయం, వైద్య సేవలు, మానసిక పరామర్శ, కౌన్సెలింగ్ వంటి సేవలను ఒకే చోట అందించాలనే లక్ష్యంతో భరోసా సెంటర్‌ను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. బాధితులకు త్వరితగతిన సహాయం అందించి, వారికి న్యాయం జరిగేలా ప్రభుత్వం కట్టుబడి ఉందని పేర్కొన్నారు.ఎమ్మెల్యే డా. కూచుకుళ్ల రాజేష్ రెడ్డి, మాట్లాడుతూ, మహిళలు, చిన్నారుల భద్రతకు రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తోందని, భరోసా సెంటర్ ద్వారా వారికి అవసరమైన అన్ని రకాల సేవలు సులభంగా అందుబాటులోకి వస్తాయని అన్నారు.ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్,నాగర్‌కర్నూల్ మున్సిపల్ చైర్మన్,వైస్ చైర్మన్ , కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు,స్థానిక కౌన్సిలర్స్ , మండల నాయకులు, ప్రజాప్రతినిధులు, సంబంధిత శాఖల అధికారులు, మహిళా మరియు శిశు సంక్షేమ శాఖ సిబ్బంది, కార్యకర్తలు మరియు తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

Most Popular

App Icon

Install CG News App

Add to home screen for faster loading and latest updates.

error: Content is protected !!