Friday, July 10, 2026
Homeఆంధ్రప్రదేశ్సంక్షేమాలకు వారధి వైఎస్సార్

సంక్షేమాలకు వారధి వైఎస్సార్

📰 Generate e-Paper Clip

నందికొట్కూరు (చైతన్యగళం):

మహానేత, దివంగత మాజీ ముఖ్యమంత్రి డా. వై.ఎస్. రాజశేఖర రెడ్డి 77వ జయంతిని పదివేల మండల కేంద్రంలో ఘనంగా నిర్వహించారు.

జడ్పీటీసీ పుల్యాల దివ్య నాగిరెడ్డి, నందికొట్కూరు సమన్వయకర్త, ఇంచార్జ్ డా. దారా సుధీర్ ఆదేశాల మేరకు సర్పంచ్ పెరుమాళ్ల శేషన్న ఆధ్వర్యంలో వైఎస్సార్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.

ఈ సందర్భంగా పుల్యాల దివ్య నాగిరెడ్డి మాట్లాడుతూ – వైఎస్సార్ నిరుపేదలకు, విద్యార్థులకు చేసిన సేవ తరాలు మారినా మరువలేనిదని, ఆయన పరిపాలన సంక్షేమానికి వారధిగా నిలిచిందని కొనియాడారు. ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయే మహానేతగా వైఎస్సార్‌ను స్మరించారు.

ఈ కార్యక్రమంలో నందికొట్కూరు మండల వైఎస్సార్‌సీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

 

RELATED ARTICLES

Most Popular

App Icon

Install CG News App

Add to home screen for faster loading and latest updates.

error: Content is protected !!