కొణిజేటి రోశయ్య సేవలు చిరస్మరణీయం

షాద్‌నగర్, జూలై 4 (చైతన్యగళం): షాద్‌నగర్‌లోని వాసవి కన్యకా పరమేశ్వరి ఆవరణలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, నిరాడంబర నాయకుడు, రాజకీయ ధీశాలి కొణిజేటి రోశయ్య 93వ జయంతి వేడుకలు శనివారం అత్యంత ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా పలువురు ప్రముఖులు ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.వక్తలు రోశయ్య రాజకీయ ప్రస్థానాన్ని స్మరించుకుంటూ, ప్రజా సేవలో ఆయన చూపిన నిబద్ధతను కొనియాడారు. దశాబ్దాల పాటు ఆర్థిక మంత్రిగా, ముఖ్యమంత్రిగా రాష్ట్ర అభివృద్ధికి ఆయన అందించిన సేవలు చిరస్మరణీయమని పేర్కొన్నారు. వివాదాలకు తావులేకుండా, అత్యంత...