Sunday, October 18, 2026
Homeతెలంగాణకరీంనగర్శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తే చర్యలు తప్పవు

శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తే చర్యలు తప్పవు

📰 Generate e-Paper Clip

  • ప్రజలు సమస్యలుంటే నేరుగా సంప్రదించాలి – తిమ్మాపూర్‌ సీఐ బర్ల అనిల్‌

మానకొండూరు, అక్టోబర్‌ 14 (చైతన్యగళం):

తిమ్మాపూర్‌ సర్కిల్‌ పరిధిలో శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని సర్కిల్‌ ఇన్‌స్పెక్టర్‌ బర్ల అనిల్‌ హెచ్చరించారు. చిగురుమామిడి, గన్నేరువరం, తిమ్మాపూర్‌ మండలాల ప్రజలు తమ సమస్యల పరిష్కారం కోసం నేరుగా తనను సంప్రదించాలని కోరారు.

ఇటీవల తిమ్మాపూర్‌ సర్కిల్‌ ఇన్‌స్పెక్టర్‌గా బాధ్యతలు స్వీకరించిన అనిల్‌ బుధవారం విలేకరులతో మాట్లాడుతూ పలు అంశాలపై స్పందించారు. యువత మత్తు పదార్థాలకు బానిస కాకుండా, చెడు అలవాట్లకు దూరంగా ఉంటూ తమ భవిష్యత్తును ఉన్నతంగా తీర్చిదిద్దుకోవాలని సూచించారు.

తమ ప్రాంతాల్లో నేరాల నియంత్రణకు ప్రజలు పోలీసులకు సమాచారం అందించి సహకరించాలని కోరారు. రాజీవ్‌ రహదారిపై తరచూ ప్రమాదాలు జరిగే ప్రాంతాలను గుర్తించి, ప్రమాదాల నివారణకు అవసరమైన చర్యలు తీసుకునేలా ప్రజలు సహకరించాలని తెలిపారు.

వాహనదారులు రహదారులపై ప్రయాణించేటప్పుడు తప్పనిసరిగా హెల్మెట్‌ ధరించాలని, ట్రాఫిక్‌ నిబంధనలు పాటించాలని సూచించారు. రహదారి భద్రతపై అవగాహనతో వ్యవహరిస్తూ తమ కుటుంబాలకు అండగా నిలవాలని అన్నారు. ప్రజల భద్రతకు ప్రాధాన్యమిస్తూ శాంతిభద్రతల పరిరక్షణకు ప్రతి ఒక్కరూ పోలీసులకు సహకరించాలని సీఐ బర్ల అనిల్‌ కోరారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install CG News App

Add to home screen for faster loading and latest updates.

error: Content is protected !!