శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తే చర్యలు తప్పవు
ప్రజలు సమస్యలుంటే నేరుగా సంప్రదించాలి - తిమ్మాపూర్ సీఐ బర్ల అనిల్ మానకొండూరు, అక్టోబర్ 14 (చైతన్యగళం): తిమ్మాపూర్ సర్కిల్ పరిధిలో శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని సర్కిల్ ఇన్స్పెక్టర్ బర్ల అనిల్ హెచ్చరించారు. చిగురుమామిడి, గన్నేరువరం, తిమ్మాపూర్ మండలాల ప్రజలు తమ సమస్యల పరిష్కారం కోసం నేరుగా తనను సంప్రదించాలని కోరారు. ఇటీవల తిమ్మాపూర్ సర్కిల్ ఇన్స్పెక్టర్గా బాధ్యతలు స్వీకరించిన అనిల్ బుధవారం విలేకరులతో మాట్లాడుతూ పలు అంశాలపై స్పందించారు. యువత మత్తు పదార్థాలకు బానిస కాకుండా, చెడు అలవాట్లకు...