- ఊరిలో లేకున్నా పుట్టినరోజు వేడుకలు నిర్వహించిన యువత.. అభిమానం మరువలేనిదన్న వినోద్
మిర్యాలగూడ, అక్టోబర్ 11 (చైతన్యగళం): వల్లపట్ల వినోద్ పుట్టినరోజు సందర్భంగా ఆయన ఊరిలో లేకపోయినా, 18వ వార్డు యువత ఘనంగా వేడుకలు నిర్వహించారు. “అన్న ఎక్కడ ఉన్నా.. మేమున్నాం అన్నా!” అంటూ వారు చూపించిన ఆప్యాయత, అభిమానానికి వినోద్ హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు.
తనపై యువత చూపిస్తున్న ప్రేమ, నమ్మకం, ఆత్మీయత మాటల్లో చెప్పలేనివని పేర్కొన్నారు. ఒక నాయకుడిపై అభిమానం, ఒక అన్నపై ప్రేమాభిమానాలను ఈ వేడుకల ద్వారా మరోసారి చాటిచెప్పారని ఆనందం వ్యక్తం చేశారు.
మీ ప్రేమే నా బలం.. మీ అభిమానం నా ఆనందం!
పుట్టినరోజు వేడుకలను ఘనంగా నిర్వహించిన 18వ వార్డు యువత సభ్యులందరికీ మరోసారి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.
