Wednesday, November 25, 2026
Homeతెలంగాణకరీంనగర్సాయిబాబా మందిరం అధ్యక్షులు వందనం కమల్ కుమార్ జన్మదిన వేడుకలు

సాయిబాబా మందిరం అధ్యక్షులు వందనం కమల్ కుమార్ జన్మదిన వేడుకలు

📰 Generate e-Paper Clip

మహబూబాబాద్(చైతన్యగళం): పట్టణంలోని సాయిబాబా మందిరం అధ్యక్షులు వందనం కమల్ కుమార్ జన్మదినాన్ని పురస్కరించుకొని దేవాలయ ప్రాంగణంలో ఆయన మిత్రులు జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కేక్ కట్ చేసి కమల్ కుమార్‌కు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. ఆయన ఆయురారోగ్యాలతో, సుఖసంతోషాలతో నిండు నూరేళ్లు జీవించాలని ఆకాంక్షించారు.

ఈ సందర్భంగా మిత్రులు మాట్లాడుతూ.. వందనం కమల్ కుమార్ మరెన్నో జన్మదిన వేడుకలను ఆనందంగా జరుపుకోవాలని, భవిష్యత్తులో మరింత ఉన్నత స్థాయికి ఎదగాలని ఆకాంక్షించారు. సాయిబాబా మందిరం అధ్యక్షుడిగా ఆయన చేస్తున్న సేవలు కొనసాగాలని, సమాజంలో అందరితో స్నేహపూర్వకంగా మెలుగుతూ మరిన్ని సేవా కార్యక్రమాల్లో భాగస్వాములు కావాలని పేర్కొన్నారు.

దేవాలయ ప్రాంగణంలో నిర్వహించిన ఈ వేడుకలు స్నేహపూర్వక వాతావరణంలో ఆనందోత్సాహాల మధ్య సాగాయి. ఈ కార్యక్రమంలో కమల్ కుమార్ మిత్రులు బోనగిరి ఆనంద్ గుప్తా, బొడ్ల శ్యామ్, భూపతి కిషోర్, పుల్లూరు హరి, సోమా పురుషోత్తం, భవిరిశెట్టి వెంకట రమణ, పాలకుర్తి శ్రీధర్, మాలే కిరణ్, శ్రేయోభిలాషులు పాల్గొని ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install CG News App

Add to home screen for faster loading and latest updates.

error: Content is protected !!