Saturday, October 10, 2026
Homeతెలంగాణనల్గొండగుండెపూరి వెంకన్న మాతృమూర్తికి బీఆర్‌ఎస్‌ నాయకుల నివాళి

గుండెపూరి వెంకన్న మాతృమూర్తికి బీఆర్‌ఎస్‌ నాయకుల నివాళి

📰 Generate e-Paper Clip

  • కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి

త్రిపురారం(చైతన్యగళం): నల్లగొండ జిల్లా త్రిపురారం మండలం అంజనపల్లి గ్రామానికి చెందిన మిర్యాలగూడ ఆంధ్రప్రభ డివిజన్‌ రిపోర్టర్‌ గుండెపూరి వెంకన్న మాతృమూర్తి పార్థివదేహానికి బీఆర్‌ఎస్‌ నాయకులు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.

ఈ సందర్భంగా నాయకులు వెంకన్న కుటుంబ సభ్యులను పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలిపారు. మాతృమూర్తి మృతి పట్ల సంతాపం వ్యక్తం చేస్తూ, ఆమె ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థించారు. ఈ కష్ట సమయంలో కుటుంబ సభ్యులకు మనోధైర్యం కలగాలని ఆకాంక్షించారు.

ఈ కార్యక్రమంలో బీఆర్‌ఎస్‌ నాయకులు తిరందాసు విష్ణు, భూక్యా రాంబాబు, మాతంగి రవి, మహా ఛానల్‌ రిపోర్టర్‌ గుండా మహేశ్‌, బూడిగ, నరసింహనాయుడు (వెంకన్న జర్నలిస్ట్‌) తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install CG News App

Add to home screen for faster loading and latest updates.

error: Content is protected !!