- ఉదయం 10 గంటలకు గ్రామ పంచాయతీ ఆవరణలో నిర్వహణ
తలకొండపల్లి, నవంబర్ 18 (చైతన్యగళం): చీపునుంతల గ్రామంలో ఈ నెల 19వ తేదీ గురువారం ఉదయం 10 గంటలకు గ్రామ పంచాయతీ ఆవరణలో ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు గ్రామ సర్పంచ్ గుజ్జుల లక్ష్మమ్మ ఆశన్న తెలిపారు.
తన ఆధ్వర్యంలో నిర్వహించనున్న ఈ కార్యక్రమానికి గ్రామ ఉపసర్పంచ్, వార్డు సభ్యులు, మాజీ ప్రజాప్రతినిధులు, యువజన నాయకులు, మహిళా సంఘాల సభ్యులు, గ్రామ పెద్దలు, ప్రజలు పెద్ద సంఖ్యలో హాజరుకావాలని సర్పంచ్ కోరారు. అందరూ భాగస్వాములై కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని విజ్ఞప్తి చేశారు.

