Thursday, November 19, 2026
Homeతెలంగాణమాడ్గుల జాబ్ డ్రైవ్‌లో 52 మందికి ఉద్యోగాలు

మాడ్గుల జాబ్ డ్రైవ్‌లో 52 మందికి ఉద్యోగాలు

📰 Generate e-Paper Clip

గ్రామీణ యువతకు ఉపాధి అవకాశాలు కల్పించడమే లక్ష్యం: సుంకిరెడ్డి రాఘవేందర్ రెడ్డి

మాడ్గుల, నవంబర్ 18 (చైతన్యగళం): గ్రామీణ ప్రాంత నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు కల్పించే లక్ష్యంతో ఐక్యత ఫౌండేషన్ చేపడుతున్న కార్యక్రమాల్లో భాగంగా మాడ్గులలో నిర్వహించిన 26వ జాబ్ డ్రైవ్ ద్వారా తొలి విడతలో 52 మంది యువత ప్రముఖ ఎలక్ట్రానిక్స్ కంపెనీలో ఉద్యోగాలకు ఎంపికయ్యారు. సుంకిరెడ్డి రాఘవేందర్ రెడ్డి సహకారంతో ఈ నియామక ప్రక్రియ చేపట్టారు.

గత నెల 28న మాడ్గులలో నిర్వహించిన జాబ్ డ్రైవ్‌కు మొత్తం 220 మంది నిరుద్యోగ యువత షార్ట్‌లిస్ట్ అయ్యారు. వారిలో అర్హులైన అభ్యర్థులకు తుక్కుగూడలోని ప్రముఖ ఎలక్ట్రానిక్స్ కంపెనీలో ఉద్యోగాలు కల్పించేందుకు ఎంపిక ప్రక్రియ నిర్వహించారు. ఇందులో భాగంగా బుధవారం జరిగిన తొలి విడత ఇంటర్వ్యూల్లో 52 మంది ఉద్యోగాలకు ఎంపికయ్యారు. ఈ నియామక ప్రక్రియను సుంకిరెడ్డి రాఘవేందర్ రెడ్డి స్వయంగా కంపెనీ వద్ద ఉండి పర్యవేక్షించారు.

గ్రామాల వారీగా నర్సాయిపల్లి నుంచి 12 మంది, కొలుకులపల్లి నుంచి నలుగురు, నల్లచెరువు నుంచి 14 మంది, మాడ్గుల నుంచి 13 మంది, ఇర్విన్ నుంచి తొమ్మిది మంది చొప్పున మొత్తం 52 మంది ఉద్యోగాలు సాధించారు.

ఈ సందర్భంగా సుంకిరెడ్డి రాఘవేందర్ రెడ్డి మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాల్లో ఎంతోమంది యువత చదువులు పూర్తి చేసుకున్నప్పటికీ సరైన ఉద్యోగ సమాచారం, అవకాశాలు లేక ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. అలాంటి యువతలోని నైపుణ్యాన్ని గుర్తించి ప్రముఖ కంపెనీల్లో ఉద్యోగ అవకాశాలు కల్పించాలనే లక్ష్యంతో ఐక్యత ఫౌండేషన్ ఆధ్వర్యంలో ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు.

తొలి విడతలో 52 మంది ఉద్యోగాలు సాధించడం సంతోషంగా ఉందని, మిగిలిన అభ్యర్థులకు కూడా తదుపరి విడతల్లో ఇంటర్వ్యూలు నిర్వహించి అర్హులైన వారికి ఉద్యోగ అవకాశాలు కల్పించేందుకు కృషి చేస్తామని వెల్లడించారు. యువత ఉద్యోగాల్లో స్థిరపడి తమ కుటుంబాలకు ఆర్థికంగా అండగా నిలవాలన్నదే తమ ఆకాంక్ష అని అన్నారు.

ఉద్యోగాలకు ఎంపికైన యువత సుంకిరెడ్డి రాఘవేందర్ రెడ్డికి, ఐక్యత ఫౌండేషన్‌కు కృతజ్ఞతలు తెలిపారు. తమ గ్రామాల నుంచే ఉద్యోగ అవకాశాలు అందుబాటులోకి రావడం, కంపెనీ వద్దకు వచ్చి ప్రోత్సహించడం ఆనందంగా ఉందని పేర్కొన్నారు.

ఈ కార్యక్రమంలో కంపెనీ ప్రతినిధి వినయ్, ఐక్యత ఫౌండేషన్ సభ్యులు చంద్రశేఖర్, నాగిళ్ల శివ, ఎరుకలి శివ తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install CG News App

Add to home screen for faster loading and latest updates.

error: Content is protected !!