Thursday, November 19, 2026
Homeతెలంగాణకైలాసగుట్టపై నూతన వెలుగులు.. భక్తుల కోసం హైమాస్ట్ లైట్లు ఏర్పాటు

కైలాసగుట్టపై నూతన వెలుగులు.. భక్తుల కోసం హైమాస్ట్ లైట్లు ఏర్పాటు

📰 Generate e-Paper Clip

సొంత నిధులతో రెండు లైట్లు ఏర్పాటు చేసిన సుంకిరెడ్డి రాఘవేందర్ రెడ్డి

కల్వకుర్తి, నవంబర్ 18 (చైతన్యగళం): ఆధ్యాత్మిక క్షేత్రాల అభివృద్ధితో పాటు భక్తులకు మెరుగైన మౌలిక సదుపాయాలు కల్పించాలనే లక్ష్యంతో ఐక్యత ఫౌండేషన్ చైర్మన్, టాస్క్ సీఓఓ సుంకిరెడ్డి రాఘవేందర్ రెడ్డి మరో సేవా కార్యక్రమం చేపట్టారు. కల్వకుర్తి మున్సిపాలిటీ పరిధిలోని ప్రసిద్ధ ఆధ్యాత్మిక క్షేత్రమైన కైలాసగుట్టపై భక్తుల సౌకర్యార్థం తన సొంత నిధులతో రెండు హైమాస్ట్ లైట్లను ఏర్పాటు చేశారు.

కైలాసగుట్టను దర్శించుకునేందుకు నిత్యం వచ్చే భక్తులకు రాత్రి వేళల్లో వెలుతురు సమస్య తలెత్తకుండా, గుట్ట పరిసర ప్రాంతాల్లో భద్రత, సౌకర్యాలు మెరుగుపడేలా ఈ ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు.

ఈ సందర్భంగా సుంకిరెడ్డి రాఘవేందర్ రెడ్డి మాట్లాడుతూ ప్రజలకు ఉపయోగపడే సేవా కార్యక్రమాలు చేపట్టడాన్ని తన బాధ్యతగా భావిస్తానని పేర్కొన్నారు. ముఖ్యంగా ఆధ్యాత్మిక ప్రదేశాలను సందర్శించే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అవసరమైన మౌలిక సదుపాయాల కల్పనకు తనవంతు సహకారం అందిస్తానని తెలిపారు. కైలాసగుట్ట అభివృద్ధికి భవిష్యత్తులోనూ అవసరమైన సహకారం అందిస్తానని హామీ ఇచ్చారు.

కైలాసగుట్టపై హైమాస్ట్ లైట్ల ఏర్పాటు పట్ల ఆలయ కమిటీ సభ్యులు, భక్తులు హర్షం వ్యక్తం చేశారు. భక్తుల అవసరాలను గుర్తించి సొంత నిధులతో ఈ కార్యక్రమం చేపట్టినందుకు సుంకిరెడ్డి రాఘవేందర్ రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు.

ఈ కార్యక్రమంలో పురం శేఖర్ రెడ్డి, బావాండ్ల మధు, సూరం తిరుపతి రెడ్డి, రఘు యాదవ్ స్వామి, కుడుముల శేఖర్ రెడ్డి, సాధు మురళీధర్ రెడ్డి, సురేష్ గౌడ్, వేణుగోపాల్ అయ్యగారు, దామర్ల శేఖర్, పురం మహేశ్వర్ రెడ్డి, బాలరాజు యాదవ్, బాలయ్య, దేశం శ్రీనివాసులు, రవి, పుమాల్, సాయి, సందీప్, ఉపేందర్ రెడ్డి, శివ తదితరులతో పాటు భక్తులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install CG News App

Add to home screen for faster loading and latest updates.

error: Content is protected !!