కైలాసగుట్టపై నూతన వెలుగులు.. భక్తుల కోసం హైమాస్ట్ లైట్లు ఏర్పాటు
సొంత నిధులతో రెండు లైట్లు ఏర్పాటు చేసిన సుంకిరెడ్డి రాఘవేందర్ రెడ్డి కల్వకుర్తి, నవంబర్ 18 (చైతన్యగళం): ఆధ్యాత్మిక క్షేత్రాల అభివృద్ధితో పాటు భక్తులకు మెరుగైన మౌలిక సదుపాయాలు కల్పించాలనే లక్ష్యంతో ఐక్యత ఫౌండేషన్ చైర్మన్, టాస్క్ సీఓఓ సుంకిరెడ్డి రాఘవేందర్ రెడ్డి మరో సేవా కార్యక్రమం చేపట్టారు. కల్వకుర్తి మున్సిపాలిటీ పరిధిలోని ప్రసిద్ధ ఆధ్యాత్మిక క్షేత్రమైన కైలాసగుట్టపై భక్తుల సౌకర్యార్థం తన సొంత నిధులతో రెండు హైమాస్ట్ లైట్లను ఏర్పాటు చేశారు. కైలాసగుట్టను దర్శించుకునేందుకు నిత్యం వచ్చే భక్తులకు రాత్రి వేళల్లో వెలుతురు...