వల్లభాపూర్ ఉన్నత పాఠశాలలో జాతీయ ఐక్యతా దినోత్సవ వేడుకలు
సర్దార్ వల్లభ్‌భాయ్ పటేల్ సేవలు చిరస్మరణీయం: ప్రధానోపాధ్యాయుడు సుదర్శన్‌రెడ్డి ఎల్కతుర్తి, అక్టోబర్ 31 (చైతన్యగళం): హనుమకొండ జిల్లా ఎల్కతుర్తి మండలం వల్లభాపూర్ ఉన్నత పాఠశాలలో భారతరత్న సర్దార్ వల్లభ్‌భాయ్ పటేల్ జయంతిని పురస్కరించుకుని జాతీయ ఐక్యతా దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. పాఠశాల ప్రధానోపాధ్యాయుడు బద్దం సుదర్శన్‌రెడ్డి అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో పటేల్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా సుదర్శన్‌రెడ్డి మాట్లాడుతూ.. ఉక్కు మనిషిగా పేరుగాంచిన స్వాతంత్ర్య సమరయోధుడు, భారత తొలి ఉప ప్రధానమంత్రి సర్దార్ వల్లభ్‌భాయ్ పటేల్ దేశానికి...