Saturday, October 31, 2026
Homeతెలంగాణకరీంనగర్ఎల్కతుర్తిలో ఇందిరా గాంధీ వర్ధంతి వేడుకలు

ఎల్కతుర్తిలో ఇందిరా గాంధీ వర్ధంతి వేడుకలు

📰 Generate e-Paper Clip

ఎల్కతుర్తి, అక్టోబర్‌ 31 (చైతన్యగళం): హనుమకొండ జిల్లా ఎల్కతుర్తి మండల కేంద్రంలోని బస్టాండ్‌ సర్కిల్‌ వద్ద భారత మాజీ ప్రధాని, ఉక్కు మహిళ ఇందిరా గాంధీ వర్ధంతి కార్యక్రమాన్ని మండల కాంగ్రెస్‌ నాయకులు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. దేశ ప్రధానిగా ఇందిరా గాంధీ అందించిన సేవలను, దేశాభివృద్ధికి తీసుకున్న కీలక నిర్ణయాలను, పేదలు, బడుగు బలహీన వర్గాల అభ్యున్నతికి చేసిన కృషిని నాయకులు స్మరించుకున్నారు. దేశ రాజకీయాల్లో ఆమె పోషించిన పాత్ర చిరస్మరణీయమని కొనియాడారు.

ఈ కార్యక్రమంలో కాంగ్రెస్‌ పార్టీ మండల అధ్యక్షుడు ముప్పు శ్రీనివాస్‌, సొసైటీ బ్యాంక్‌ చైర్మన్‌ ఇంద్రసేనారెడ్డి, మాజీ మండల అధ్యక్షుడు గోలి రాజేశ్వరరావు, సూరారం గ్రామ శాఖ అధ్యక్షుడు బచ్చు శ్రీధర్‌రావు, ఆంబాల శ్రీకాంత్‌, బక్కి ఏఎంసీ డైరెక్టర్‌ గొడిశాల రాజయ్య, శనిగరపు వెంకటేష్‌, మండ సుమన్‌గౌడ్‌, బ్యాంక్‌ డైరెక్టర్‌ తంగళ్లపెల్లి కొంరయ్య, బొల్లెపోగు రమేష్‌బాబు, గొడిశాల అర్జున్‌గౌడ్‌, కుర్ర ప్రకాష్‌గౌడ్‌, వల్లభాపూర్‌ గ్రామ శాఖ అధ్యక్షుడు గౌతమ్‌తో పాటు మండలంలోని వివిధ గ్రామ శాఖల అధ్యక్షులు, సీనియర్‌ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install CG News App

Add to home screen for faster loading and latest updates.

error: Content is protected !!