ఎల్కతుర్తిలో ఇందిరా గాంధీ వర్ధంతి వేడుకలు

ఎల్కతుర్తి, అక్టోబర్‌ 31 (చైతన్యగళం): హనుమకొండ జిల్లా ఎల్కతుర్తి మండల కేంద్రంలోని బస్టాండ్‌ సర్కిల్‌ వద్ద భారత మాజీ ప్రధాని, ఉక్కు మహిళ ఇందిరా గాంధీ వర్ధంతి కార్యక్రమాన్ని మండల కాంగ్రెస్‌ నాయకులు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. దేశ ప్రధానిగా ఇందిరా గాంధీ అందించిన సేవలను, దేశాభివృద్ధికి తీసుకున్న కీలక నిర్ణయాలను, పేదలు, బడుగు బలహీన వర్గాల అభ్యున్నతికి చేసిన కృషిని నాయకులు స్మరించుకున్నారు. దేశ రాజకీయాల్లో ఆమె పోషించిన పాత్ర చిరస్మరణీయమని కొనియాడారు. ఈ...