Saturday, October 31, 2026
Homeతెలంగాణకరీంనగర్పందిళ్ల స్టేజీ వద్ద టోల్‌గేట్‌ పనులు నత్తనడక!

పందిళ్ల స్టేజీ వద్ద టోల్‌గేట్‌ పనులు నత్తనడక!

📰 Generate e-Paper Clip

  • వాహనదారుల ఇబ్బందులు పట్టించుకోరా? మంత్రి సమీక్షించి పనులు వేగవంతం చేయాలి: బీఆర్‌ఎస్‌

హుస్నాబాద్‌ రూరల్‌, అక్టోబర్‌ 31 (చైతన్యగళం): హుస్నాబాద్‌ మండలం పందిళ్ల స్టేజీ సమీపంలో జాతీయ రహదారిపై చేపట్టిన టోల్‌గేట్‌ నిర్మాణ పనులు నత్తనడకన సాగుతున్నాయని బీఆర్‌ఎస్‌ నాయకులు విమర్శించారు. శనివారం పార్టీ ఆధ్వర్యంలో నిర్మాణ పనులను పరిశీలించారు.

ఈ సందర్భంగా బీఆర్‌ఎస్‌ పార్టీ నియోజకవర్గ అధికార ప్రతినిధి అయిలేని మల్లికార్జునరెడ్డి మాట్లాడుతూ.. టోల్‌గేట్‌ నిర్మాణ పనులు ఆలస్యం కావడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. నిర్మాణ పనులు ప్రారంభించి దాదాపు ఏడాదిన్నర గడిచినా ఇంకా పూర్తి కాలేదని అన్నారు. జాతీయ రహదారి పనులు ప్రారంభమై రెండున్నరేళ్లు గడుస్తున్నా పలుచోట్ల పనులు అసంపూర్తిగా ఉన్నాయని విమర్శించారు.

వర్షం పడితే రహదారిపై బురద, ఎండ కాస్తే దుమ్ము, ధూళితో ప్రజలు, వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారని పేర్కొన్నారు. నిర్మాణ పనులు పూర్తికాకపోవడంతో వాహనాలు తరచూ ప్రమాదాలకు గురవుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రజలు, ప్రయాణికులు ఎదుర్కొంటున్న సమస్యలను అధికారులు పట్టించుకోవడం లేదని విమర్శించారు.

ఇప్పటికైనా సంబంధిత మంత్రి జాతీయ రహదారి పనులపై ప్రత్యేక సమీక్ష నిర్వహించి, టోల్‌గేట్‌ నిర్మాణాన్ని త్వరితగతిన పూర్తి చేసేలా అధికారులను ఆదేశించాలని అయిలేని మల్లికార్జునరెడ్డి డిమాండ్‌ చేశారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install CG News App

Add to home screen for faster loading and latest updates.

error: Content is protected !!