Sunday, November 1, 2026
Homeసంపాదకీయం36 ఏళ్ల ఆర్టీసీ సేవలకు వీడ్కోలు

36 ఏళ్ల ఆర్టీసీ సేవలకు వీడ్కోలు

📰 Generate e-Paper Clip

  • డ్రైవర్‌గా పదవీ విరమణ పొందిన గుడేల్లి రాములు

ఎల్కతుర్తి, అక్టోబర్‌ 31 (చైతన్యగళం):

హనుమకొండ జిల్లా ఎల్కతుర్తి గ్రామానికి చెందిన గుడేల్లి రాములు ఆర్టీసీ సంస్థలో 36 ఏళ్లపాటు డ్రైవర్‌గా సేవలందించి శనివారం పదవీ విరమణ పొందారు. హనుమకొండ లోకల్‌ డిపోలో విధులు నిర్వహించిన ఆయన సుదీర్ఘకాలం సంస్థకు అందించిన సేవలకు పలువురు అభినందనలు తెలిపారు.

ఈ సందర్భంగా ఇంగె భాస్కర్‌ గుడేల్లి రాములును శాలువాతో ఘనంగా సత్కరించి పదవీ విరమణ శుభాకాంక్షలు తెలిపారు. ఆర్టీసీ సంస్థకు ఆయన అందించిన సేవలను కొనియాడారు. పదవీ విరమణ అనంతరం కుటుంబ సభ్యులతో కలిసి ఆయురారోగ్యాలతో, సుఖసంతోషాలతో నిండు నూరేళ్లు జీవించాలని ఆకాంక్షించారు.

ఈ కార్యక్రమంలో భాషబోయిన కుమార్‌ యాదవ్‌, టీచర్‌ కుమార్‌, కందుకూరి శ్రీనివాస్‌ తదితరులు పాల్గొని గుడేల్లి రాములుకు శుభాకాంక్షలు తెలిపారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install CG News App

Add to home screen for faster loading and latest updates.

error: Content is protected !!