- మంత్రి పొన్నం ప్రభాకర్‌కు సీపీఐ నాయకుల కృతజ్ఞతలు
హుస్నాబాద్, నవంబర్ 20 (నీలగిరి ఎక్స్‌ప్రెస్):
నిజాం నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా సాగిన తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటంలో ప్రాణాలర్పించిన మహ్మదాపూర్ అమరవీరుల స్మారక భవన నిర్మాణానికి రూ.2.30 కోట్ల నిధులు మంజూరు కావడంపై సీపీఐ నాయకులు హర్షం వ్యక్తం చేశారు. ఈ నిధుల మంజూరుకు కృషి చేసిన హుస్నాబాద్ ఎమ్మెల్యే, రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్‌కు కృతజ్ఞతలు తెలిపారు.
మహ్మదాపూర్ అమరవీరుల స్మృతి చిహ్నంగా నిర్మించనున్న ఈ స్మారక భవనం అనభేరి ప్రభాకర్‌రావు, సింగిరెడ్డి భూపతిరెడ్డితో పాటు మరో పది మంది అమరవీరుల త్యాగాలకు గుర్తుగా నిలవనుందని నాయకులు పేర్కొన్నారు. తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట చరిత్రను, అమరవీరుల త్యాగాలను భావితరాలకు పరిచయం చేసేందుకు ఈ నిర్మాణం దోహదపడుతుందని తెలిపారు.
ఈ సందర్భంగా సీపీఐ నేత, మాజీ ఎమ్మెల్యే చాడ వెంకటరెడ్డి, సీపీఐ కన్వీనర్ జాగీర్ సత్యనారాయణ, జిల్లా సహాయ కార్యదర్శి, హుస్నాబాద్ మాజీ వైస్ ఎంపీపీ గడిపె మల్లేశ్, మండల నాయకులు పొదిల కుమారస్వామి, జనగాం రాజ్‌కుమార్, గూడ పద్మ, అయిలేని సంజీవరెడ్డి, కాల్వల ఎల్లయ్య, అయిలేని మల్లారెడ్డి, జంగ విజయ, దొంతరవేని రజిత, మహ్మదాపూర్ గ్రామశాఖ కార్యదర్శి పిట్టల మెగిలయ్య, మాజీ ఎంపీటీసీ సభ్యుడు పిట్టల సుధాకర్, మాజీ సర్పంచ్ పిట్టల కనకలక్ష్మి, నాయకులు పిట్టల ప్రసాద్, పిట్టల బాలయ్య, దుద్దేడ రాజయ్యతో పాటు అనభేరి, సింగిరెడ్డి అమరవీరుల కుటుంబ సభ్యులు మంత్రి పొన్నం ప్రభాకర్‌కు కృతజ్ఞతలు తెలిపారు.

