Friday, November 20, 2026
Homeతెలంగాణహుస్నాబాద్‌ అభివృద్ధిలో సరికొత్త అధ్యాయం

హుస్నాబాద్‌ అభివృద్ధిలో సరికొత్త అధ్యాయం

📰 Generate e-Paper Clip

  • ఎన్నడూ లేనివిధంగా అభివృద్ధి పనులు చేపడుతున్న మంత్రి పొన్నం ప్రభాకర్‌
  • అనభేరి ప్రభాకర్‌రావు స్మారక పార్క్‌, హాల్‌ అభివృద్ధికి రూ.2.30 కోట్ల నిధులు మంజూరు హర్షణీయం: సీపీఐ జిల్లా కార్యదర్శి మంద పవన్‌

హుస్నాబాద్‌, నవంబర్‌ 20 (నీలగిరి ఎక్స్‌ప్రెస్‌):

హుస్నాబాద్‌ నియోజకవర్గ అభివృద్ధికి మంత్రి పొన్నం ప్రభాకర్‌ ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటూ, ఎన్నడూ లేనివిధంగా అభివృద్ధి పనులను వేగవంతం చేయడం అభినందనీయమని సీపీఐ సిద్దిపేట జిల్లా కార్యదర్శి మంద పవన్‌ పేర్కొన్నారు. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్‌ సమీపంలోని మహమ్మదాపూర్‌ గ్రామంలో తెలంగాణ పోరాట యోధుడు, తెలంగాణ భగత్‌సింగ్‌గా పేరుగాంచిన అనభేరి ప్రభాకర్‌రావు స్మారక పార్క్‌, హాల్‌ అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం రూ.2.30 కోట్ల నిధులు మంజూరు చేయడంపై ఆయన హర్షం వ్యక్తం చేశారు.

మంత్రి పొన్నం ప్రభాకర్‌ ప్రత్యేక చొరవ, కృషి ఫలితంగానే ఈ నిధులు మంజూరయ్యాయని తెలిపారు. తెలంగాణ సాయుధ రైతాంగ పోరాట చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోయిన అనభేరి ప్రభాకర్‌రావు స్మారక ప్రదేశాన్ని అభివృద్ధి చేయడం చరిత్రను గౌరవించుకోవడంతోపాటు భావితరాలకు పోరాట స్ఫూర్తిని అందించే గొప్ప కార్యక్రమమని పేర్కొన్నారు.

హుస్నాబాద్‌ నియోజకవర్గంలో రహదారులు, మౌలిక వసతులు, విద్య, వైద్యం, పర్యాటక రంగం సహా అన్ని రంగాల అభివృద్ధికి మంత్రి ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తున్నారని మంద పవన్‌ అన్నారు. గతంలో ఎన్నడూ లేనివిధంగా నియోజకవర్గానికి అభివృద్ధి పనులు, నిధులు తీసుకొస్తూ ప్రాంత రూపురేఖలు మార్చేందుకు కృషి చేస్తున్నారని కొనియాడారు.

హుస్నాబాద్‌ ప్రాంతానికి చారిత్రకంగా, సాంస్కృతికంగా ప్రత్యేకత ఉందని, ఇక్కడి చారిత్రక ప్రదేశాలను అభివృద్ధి చేయడం ద్వారా పర్యాటక రంగానికి కొత్త అవకాశాలు ఏర్పడతాయని తెలిపారు. మహమ్మదాపూర్‌లో అనభేరి ప్రభాకర్‌రావు స్మారక పార్క్‌, హాల్‌ అభివృద్ధి పూర్తయితే ఈ ప్రాంతానికి మరింత గుర్తింపు లభించడంతోపాటు పర్యాటకుల రాక పెరిగే అవకాశం ఉందన్నారు.

ఈ అభివృద్ధి పనులకు రూ.2,30,00,000 నిధుల పరిపాలనా అనుమతులు మంజూరు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం 2026 నవంబర్‌ 19న జి.ఓ.ఆర్‌.టి. నంబర్‌ 348 జారీ చేయడం స్వాగతించదగ్గ పరిణామమని పేర్కొన్నారు. మంత్రి పొన్నం ప్రభాకర్‌ కృషితో హుస్నాబాద్‌ నియోజకవర్గం అభివృద్ధితోపాటు చారిత్రక, పర్యాటక, సాంస్కృతిక రంగాల్లోనూ రాష్ట్రవ్యాప్తంగా ప్రత్యేక గుర్తింపు పొందే దిశగా ముందుకు సాగుతోందని ఆశాభావం వ్యక్తం చేశారు.

హుస్నాబాద్‌ను రాష్ట్రంలోనే ఆదర్శ నియోజకవర్గంగా తీర్చిదిద్దేందుకు మంత్రి చేస్తున్న కృషికి ప్రజలందరూ సహకరించాలని మంద పవన్‌ కోరారు. అభివృద్ధితోపాటు చారిత్రక వారసత్వ పరిరక్షణకు ప్రాధాన్యతనిస్తూ నిధులు మంజూరు చేసిన రాష్ట్ర ప్రభుత్వానికి, ప్రత్యేక చొరవ తీసుకున్న మంత్రి పొన్నం ప్రభాకర్‌కు సీపీఐ పక్షాన అభినందనలు, ధన్యవాదాలు తెలిపారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install CG News App

Add to home screen for faster loading and latest updates.

error: Content is protected !!