- డ్రైవర్‌గా పదవీ విరమణ పొందిన గుడేల్లి రాములు
ఎల్కతుర్తి, అక్టోబర్ 31 (చైతన్యగళం):
హనుమకొండ జిల్లా ఎల్కతుర్తి గ్రామానికి చెందిన గుడేల్లి రాములు ఆర్టీసీ సంస్థలో 36 ఏళ్లపాటు డ్రైవర్‌గా సేవలందించి శనివారం పదవీ విరమణ పొందారు. హనుమకొండ లోకల్ డిపోలో విధులు నిర్వహించిన ఆయన సుదీర్ఘకాలం సంస్థకు అందించిన సేవలకు పలువురు అభినందనలు తెలిపారు.
ఈ సందర్భంగా ఇంగె భాస్కర్ గుడేల్లి రాములును శాలువాతో ఘనంగా సత్కరించి పదవీ విరమణ శుభాకాంక్షలు తెలిపారు. ఆర్టీసీ సంస్థకు ఆయన అందించిన సేవలను కొనియాడారు. పదవీ విరమణ అనంతరం కుటుంబ సభ్యులతో కలిసి ఆయురారోగ్యాలతో, సుఖసంతోషాలతో నిండు నూరేళ్లు జీవించాలని ఆకాంక్షించారు.
ఈ కార్యక్రమంలో భాషబోయిన కుమార్ యాదవ్, టీచర్ కుమార్, కందుకూరి శ్రీనివాస్ తదితరులు పాల్గొని గుడేల్లి రాములుకు శుభాకాంక్షలు తెలిపారు.