ధాన్యం కొనుగోలు కేంద్రాలను వెంటనే ప్రారంభించాలి
క్వింటాకు రూ.3,500 చెల్లించి రైతులను ఆదుకోవాలి: బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు గుగులోతు రాజు నాయక్ అక్కన్నపేట, అక్టోబర్ 29 (చైతన్యగళం): రైతులు పండించిన వరి ధాన్యాన్ని కొనుగోలు చేసేందుకు ఐకేపీ కేంద్రాలను తక్షణమే ప్రారంభించాలని బీఆర్ఎస్ అక్కన్నపేట మండల అధ్యక్షుడు గుగులోతు రాజు నాయక్ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. అక్కన్నపేట మండలం మల్లెచెట్టు తండా పరిధిలో నిర్వహించిన పార్టీ కార్యకర్తల సమావేశంలో ఆయన ఈ డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా రాజు నాయక్ మాట్లాడుతూ కొనుగోలు కేంద్రాలు ప్రారంభం కాకపోవడంతో రైతులు ధాన్యం...