- ప్రజలకు స్వచ్ఛమైన తాగునీరు అందించడమే లక్ష్యం: బీఆర్ఆర్ ఫౌండేషన్
కుత్బుల్లాపూర్ (చైతన్యగళం):
ప్రజలకు స్వచ్ఛమైన తాగునీరు అందించాలనే లక్ష్యంతో బీఆర్ఆర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో కుత్బుల్లాపూర్లో నూతన వాటర్ ప్లాంట్ను ఏర్పాటు చేశారు. అబ్దుల్లాపూర్మెట్ మండలం, కుంట్లూరు డివిజన్ పరిధిలోని కుత్బుల్లాపూర్ గ్రామంలో ఏర్పాటు చేసిన ఈ ప్లాంట్ను ఫౌండేషన్ చైర్మన్ బూడిద రామ్ ప్రారంభించారు.
ఈ సందర్భంగా బూడిద రామ్ మాట్లాడుతూ.. ప్రతి ఒక్కరి దైనందిన జీవితంలో నీరు ఎంతో కీలకమని, ఆరోగ్యాన్ని కాపాడుకునేందుకు స్వచ్ఛమైన తాగునీటిని వినియోగించాలని సూచించారు. ప్రజలకు పరిశుభ్రమైన తాగునీరు అందుబాటులో ఉండాలనే ఉద్దేశంతో ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఈ వాటర్ ప్లాంట్ను ప్రారంభించినట్లు తెలిపారు. యువత చెడు అలవాట్లకు దూరంగా ఉంటూ, మంచి ఆహారపు అలవాట్లను పెంపొందించుకోవాలని కోరారు.
ఈ కార్యక్రమంలో కుత్బుల్లాపూర్ మాజీ సర్పంచ్ ముద్దం వీరస్వామి యాదవ్, కుంట్లూరు డివిజన్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు భీమాగౌని భాస్కర్ గౌడ్, భీమగౌని గౌరి శంకర్ గౌడ్, మాజీ ఎంపీటీసీలు సందిల బాలరాజు గౌడ్, కళ్లెం రాములు, కొత్తకంటి శ్రీనివాస్, పోలోజి బ్రహ్మచారి, భీమగౌని చిన్న గౌరిశంకర్ గౌడ్, మైసగౌని సంపత్ కుమార్, రచమల పోచయ్య, శ్రీనివాస్, అనాజ్పూర్ సర్పంచ్ రాచపాక నవనిత మహేష్, వార్డు సభ్యుడు రామ్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ యువ నాయకుడు సందిల రోహిత్ గౌడ్, ఫౌండేషన్ సభ్యులు మడుపు గోపాల్, మంగ ఐలేష్, ఎండీ సద్దాం, శేఖర్ యాదవ్, సాయి గౌడ్ తదితరులు పాల్గొన్నారు.
