కుత్బుల్లాపూర్‌లో నూతన వాటర్ ప్లాంట్ ప్రారంభం
ప్రజలకు స్వచ్ఛమైన తాగునీరు అందించడమే లక్ష్యం: బీఆర్‌ఆర్ ఫౌండేషన్ కుత్బుల్లాపూర్ (చైతన్యగళం): ప్రజలకు స్వచ్ఛమైన తాగునీరు అందించాలనే లక్ష్యంతో బీఆర్‌ఆర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో కుత్బుల్లాపూర్‌లో నూతన వాటర్ ప్లాంట్‌ను ఏర్పాటు చేశారు. అబ్దుల్లాపూర్‌మెట్ మండలం, కుంట్లూరు డివిజన్ పరిధిలోని కుత్బుల్లాపూర్ గ్రామంలో ఏర్పాటు చేసిన ఈ ప్లాంట్‌ను ఫౌండేషన్ చైర్మన్ బూడిద రామ్ ప్రారంభించారు. ఈ సందర్భంగా బూడిద రామ్ మాట్లాడుతూ.. ప్రతి ఒక్కరి దైనందిన జీవితంలో నీరు ఎంతో కీలకమని, ఆరోగ్యాన్ని కాపాడుకునేందుకు స్వచ్ఛమైన తాగునీటిని వినియోగించాలని సూచించారు. ప్రజలకు పరిశుభ్రమైన తాగునీరు...